: సోషల్ మీడియాలో వైరల్ అయిన 'రూ. 2000 నోటు' టెస్టింగ్ వీడియో!


500, 1000 నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త 500, 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నోట్లపై గతంలో వచ్చిన కొన్ని పుకార్ల నేపథ్యంలో 2000 నోటుపై ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రధానంగా 2000 నోటు కలర్, సెక్యూరిటీ ఫీచర్స్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో 2000 నోటు తీసుకున్న కొంత మంది ఈ నోటులో జీపీఆర్ఎస్ ట్రాకింగ్ డివైస్ కోసం వెతుకులాడుతున్నారు. మరికొందరు, ఈ నోటు రంగు వెలిసిపోతుందేమోనన్న అనుమానంతో, ఈ నోటును ట్యాప్ కింద, షవర్ కింద కడుగుతూ కనిపిస్తున్నారు. పింక్ కలర్ పోతోందంటూ కొంతమంది ఆరోపించగా, మరికొందరు భయంలేదని అభయమిస్తున్నారు. ఈ ప్రయోగాలు ఎక్కడ? ఎవరు? చేశారన్న విషయాలు తెలియనప్పటికీ ఈ వీడియోలు మాత్రం వైరల్ అయ్యాయి.

  • Loading...

More Telugu News