: రెచ్చిపోతున్న పాకిస్థాన్.. ఏడుగురు పాక్ రేంజర్లు మృతి చెందిన అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు
భారత బలగాల కాల్పుల్లో ఆరుగురు పాకిస్థాన్ రేంజర్లు మృతి చెందారని పాకిస్థాన్ ఆర్మీ కొద్ది సేపటి క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారులు ఇస్లామాబాద్ లోని భారత్ హై కమిషనర్ గౌతమ్ బాంబావాలేకు సమన్లు పంపించారు. మరోవైపు, పాకిస్థాన్ రేంజర్లు మరోసారి రెచ్చిపోయారు. సుందర్‌బని, నౌషెరా, ప్లాన్‌వాలా, అంఖూర్ సెక్టార్లలో పాక్ రేంజర్ల కాల్పులు జరుపుతున్నారు. అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు పాక్ రేంజర్ల కాల్పులకు దీటుగా సమాధానం చెబుతున్నాయి.