: రూ.24 లక్షల నోట్లు మారుస్తుండగా పట్టుకున్న పోలీసులు.. ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
రద్దయిన పెద్ద నోట్లు ఇకపై చిత్తు కాగితాల్లా మారే ప్రమాదం ఉందని భావిస్తోన్న నల్లకుబేరులు వాటిని మార్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పలు అడ్డదారుల ద్వారా మార్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో ఈ రోజు నల్లధన మార్పిడి కలకలం రేపింది. రూ.24 లక్షలను దళారుల ద్వారా మారుస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.