: షూటింగ్ లో మృతిచెందిన ఉదయ్, అనిల్ కు 5 లక్షల చొప్పున పరిహారం
'దునియా' విజయ్ హీరోగా నటిస్తున్న 'మాస్తిగుడి' సినిమా క్లైమాక్స్ షూటింగులో భాగంగా కర్ణాటకలోని రిజర్వాయర్లోకి హెలికాప్టర్ నుంచి దూకిన ఆర్టిస్టులు అనిల్, ఉదయ్ లు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం అనిల్, ఉదయ్ కుటుంబాలకు పరిహారంగా 5 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయాధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలు కేసులు నమోదు చేసిన పోలీసులు నిర్మాత సుందర్ పి.గౌడను అరెస్టు చేయగా, తాజాగా స్టంట్ మాస్టర్ రవి వర్మ, డైరెక్టర్ నాగశేఖర్, అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్బు పోలీసుల ముందు లొంగిపోయారు.