: ఏపీలో రూ. 6,706 కోట్లు డిపాజిట్ అయ్యాయి: చంద్రబాబు
నోట్ల రద్దు నేపథ్యంలో ఏపీ ప్రజలు భారీ ఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. నిన్నటి వరకు రూ. 6,706 కోట్లు డిపాజిట్ అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో చంద్రబాబు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రూ. 50 నోట్లను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నోట్ల విషయంలో బ్యాంకు సిబ్బంది, ఆర్బీఐ అధికారులు వేగంగా స్పందించాలని కోరారు.