: హోటల్ లో వణికిపోయిన పాకిస్థాన్ క్రికెటర్లు


రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లిన పాకిస్థాన్ క్రికెటర్లు భయంతో వణికిపోయారు. వివరాల్లోకి వెళ్తే, నీల్సన్ లోని ఓ హోటల్లో పాక్ క్రికెటర్లు బస చేశారు. ఇదే సమయంలో స్థానికంగా భూప్రకంపనలు వచ్చాయి. అంతేకాదు, సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో వారు షాక్ కు గురయ్యారు. అయితే హోటల్ సిబ్బంది వెంటనే వారిని హోటల్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత సునామీ ప్రమాదం లేదనే వార్త వచ్చిన అనంతరం వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కష్ట సమయంలో హోటల్ సిబ్బంది తమకు రక్షణగా నిలిచారని పాకిస్థాన్ టీమ్ మేనేజర్ వాసిం బారీ తెలిపాడు. క్రైస్ట్ చర్చ్ నగరాన్ని ఆనుకుని పలు ప్రాంతాల్లో నిన్న భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలను జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుంది.

  • Loading...

More Telugu News