: బ్యాంకుకు వెళ్లక్కర్లేకుండానే వంద రూపాయల నోట్లు డైరెక్టుగా ఇంటికే వచ్చేశాయ్!
బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడకుండానే ఓ గ్రామంలోని ఇండియన బ్యాంక్ ఖాతాదారులకి డబ్బులు అందాయి. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని పుంగత్తూరు గ్రామంలో నిన్న సదరు బ్యాంకు క్యాషియర్లు ఖాతాదారుల ఇళ్లకు వెళ్లి, వారి ఇంటి వద్దే రద్దయిన పెద్ద నోట్లు తీసుకుని వంద రూపాయల నోట్లను ఇచ్చారు. బ్యాంకుల ముందు బారులు తీరి గంటల తరబడి నిలబడకముందే తమను వంద నోట్లు వెతుక్కుంటూ వచ్చినందుకు పుంగత్తూరు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బ్యాంక్‌ల వద్దకు బారీగా చేరుకుంటున్న కస్టమర్ల సంఖ్యను తగ్గించేందుకు బ్యాంకర్లు ఇలా సేవ చేస్తున్నారు.