: పార్లమెంటును కుదిపేయనున్న పెద్ద నోట్ల రద్దు అంశం... చేతులు కలుపుతున్న విపక్షాలు
ఈ నెల 16 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా కొనసాగబోతున్నాయి. పెద్ద నోట్ల రద్దు అంశం పార్లమెంటును కుదిపేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంపై విపక్షాలు దాడికి సిద్ధమవుతున్నాయి. నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై విపక్ష నేతలు విరుచుకుపడబోతున్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఈ రోజు భేటీ కానున్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్ కన్నా ముందే వారు సమావేశం అవుతున్నారు. మరోవైపు లాలూ ప్రసాద్, కేజ్రీవాల్, వామపక్ష నేతలు ఇప్పటికే మోదీ నిర్ణయాన్ని తప్పుబట్టారు.