: డెబిట్ కార్డ్ నెట్ వర్క్ హ్యాంగ్
డెబిట్ కార్డును ఎన్నడూ వాడని వారు కూడా... పెద్ద నోట్ల రద్దుతో వాటిని వాడుతున్నారు. దీంతో, గతంలో 8 శాతం ఉన్న డెబిట్ కార్డ్ లావాదేవీలు ఇప్పుడు ఏకంగా 23 శాతం పెరిగాయి. దీంతో, నెట్ వర్క్ పై ఓవర్ లోడ్ పడుతోంది. ఈ నేపథ్యంలో, డెబిట్ కార్డ్ లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. నెట్ వర్క్ హ్యాంగ్ అవుతోంది. కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల డెబిట్ కార్డుల వాడకం ఏకంగా 300 శాతం పెరిగింది. ఇక మన దేశంలో మొత్తం 70 కోట్ల డెబిట్ కార్డుదారులు ఉన్నారు. వీరిలో చాలామంది ఇప్పుడు డెబిట్ కార్డులను వాడుతుండటంతో... నెట్ వర్క్ హాంగ్ అవుతోంది. కొత్తగా డెబిట్ కార్డులు వాడుతున్న వారి వల్ల కూడా నెట్ వర్క్ పై ప్రభావం పడుతోంది. తాజా పరిస్థితుల్లో డెబిట్ కార్డులను వాడటం ప్రారంభించిన వారికి సరైన అవగాహన లేదని... పిన్ నంబర్లు తప్పు కొడుతున్నారని పేమెంట్ కంపెనీల అధికారులు చెబుతున్నారు. పిన్ నంబర్ ఎంటర్ చేయడానికి మూడు సార్లు అవకాశం ఉంటుందని... మూడు సార్లూ తప్పు కొడితే కార్డ్ లాక్ అవుతుందని... కార్డు దొంగతనానికి గురైనట్టు పేమెంట్ నెట్ వర్క్ సిస్టమ్ భావిస్తుందని చెప్పారు.