: మోదీ నిర్ణయం సాహసోపేతం... అయినా ఇది చాలదు: చైనా


పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని చైనా ప్రభుత్వ మీడియా కితాబిచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. అయితే, నోట్ల రద్దు మాత్రమే నల్లధన నియంత్రణ, అవినీతి నిర్మూలనకు సరిపోదని... వ్యవస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందని సూచించింది. రియల్ ఎస్టేట్, బంగారం, విదేశీ ఆస్తులతోనూ చీకటి ఒప్పందాలు జరుగుతున్న సంగతిని గుర్తించాలని తెలిపింది. ఈ విషయంలో సలహాల కోసం చైనా వైపు చూడాల్సిన అవసరం ఉందని... అవినీతిని నిర్మూలించేందుకు చైనా అనుసరిస్తున్న విధానాలు భారత్ కు ఉపయోగపడతాయని చెప్పింది. మరోవైపు, మోదీ తిరుగులేని నిర్ణయం తీసుకున్నారని ఆర్థిక విశ్లేషకుడు అయి జున్ అన్నారు. మోదీ బాగా పని చేస్తున్నారని... అవినీతిపై పోరును ఆయన మరింత ఉద్ధృతం చేయాల్సి ఉందని చెప్పారు. అక్రమ వ్యాపారమంతా ఎక్కువగా డబ్బు రూపంలోనే జరుగుతుందనే విషయాన్ని అందరూ గుర్తించాలని తెలిపారు.

  • Loading...

More Telugu News