: న్యూజిలాండ్ లో భూకంపం పర్యవసానం... 8 అడుగుల ఎత్తయిన సునామీ అలలు
న్యూజిలాండ్ ను తాకిన 7.8 తీవ్రత గల భూకంపం సునామీని సృష్టించగా, తీర ప్రాంతంలో సుమారు 8 అడుగుల ఎత్తయిన అలలు విరుచుకుపడ్డాయి. గడచిన 38 సంవత్సరాల్లో సముద్రం అలలు ఇంత ఎత్తున లేచిన సందర్భాన్ని తాము చూడలేదని న్యూజిలాండ్ వాతావరణ శాఖ అధికారి ఫిలిప్ డుంకన్ వెల్లడించారు. అలలు వచ్చి వెళ్లిపోయిన తరువాత, సునామీ హెచ్చరికలను తాత్కాలికంగా వెనక్కు తీసుకున్నామని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల ఇంకా స్వల్ప ప్రకంపనలు వస్తూనే ఉన్నాయని, కొండ చరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగిందని ఆయన తెలిపారు. కాగా, భూకంప ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.