: పండిట్ నెహ్రూ 127వ జయంత్యుత్సవాలు.. రాజ్‌భవన్‌కు వివిధ వేషధారణలతో తరలివచ్చిన చిన్నారులు!
దేశ వ్యాప్తంగా నేడు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ నెహ్రూ 127వ జయంతి సందర్భంగా భారతీయులంతా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ.. న్యూఢిల్లీలో నెహ్రూకి ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లోనూ గవర్నర్ నరసింహన్ సమక్షంలో బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాజ్‌భవన్‌కు వివిధ వేషధారణలతో తరలివచ్చిన చిన్నారులు గవర్నర్‌ని కలిశారు. నరసింహన్ చిన్నారులకి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.