: 17 నుంచి విశాఖలో టెస్టు మ్యాచ్... టికెట్ అమ్మకాలు ప్రారంభించిన నిమిషాల్లో సోల్డ్ అవుట్!


ఈ నెల 17 నుంచి విశాఖపట్నంలోని ఏసీఏ - వీడీసీఏ స్టేడింయంలో ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఈ ఉదయం నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అమ్మకాలు మొదలైన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డులు కనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా సాధారణ క్రికెట్ అభిమానులు కోరుకునే తక్కువ ధర గ్యాలరీ సీట్లన్నీ అయిపోయినట్టు తెలుస్తోంది. స్టేడియం సీఎంఆర్ సెంట్రల్ సహా ఐదు చోట్ల టికెట్లను అందుబాటులో ఉంచగా, ఈ ప్రాంతాలన్నింటిలో తెల్లవారుఝాము నుంచి అభిమానుల సందడి నెలకొంది.

  • Loading...

More Telugu News