: అధ్యక్షుడిగా ఏడాదికి ఒక్క డాలర్ మాత్రమే వేతనంగా తీసుకుంటాను!: ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి ఎంపికైన డొనాల్డ్ ట్రంప్, తాను ఒక్క డాలర్ మాత్రమే వేతనంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. అధ్యక్షుడికి వేతనంగా లభించే 4 లక్షల డాలర్లను తాను త్యజిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ లో తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం, వేతనం తీసుకోకుండానే అమెరికాకు సేవ చేయనున్నట్టు సీబీఎస్ చానల్ కు తెలిపారు. చానల్ నిర్వహించే '60 మినిట్స్'లో ఆయన మాట్లాడారు. అమెరికాలో అమలవుతున్న చట్టాల ప్రకారం ఎంతో కొంత తీసుకోవాల్సిందే కాబట్టి సంవత్సరానికి ఒక్క డాలర్ ను వేతనంగా స్వీకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.