: రహస్యంగా పెళ్లి చేసుకుంటానంటున్న హాలీవుడ్ భామ
ప్రముఖ బాలీవుడ్ నటి డకోటా జాన్సన్ రహస్యంగా పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. తన తల్లిదండ్రులు, తాతబామ్మల బాటలోనే తాను కూడా నడవాలనుకుంటున్నట్టు చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డకోటా తాతబామ్మలు టిప్పీ, పీటర్ గ్రిఫిత్ లు మాట్లాడుతూ, తాము 18 నెలలపాటు కలిసున్న తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అంతేకాదు, డకోటా తల్లి దండ్రులు డోన్ జాన్సన్, మిలానీ గ్రిఫిత్ లు కూడా ఇలానే రహస్య వివాహం చేసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో, తన పెద్దల సంప్రదాయాన్నే తాను కూడా కొనసాగిస్తానని డకోట్ జాన్సన్ తెలిపింది. ఒకవేళ తొలి ప్రయత్నంలో తాను అనుకున్నది జరగకపోతే... మరోసారి ప్రయత్నిస్తానని చెప్పింది.