: ఏపీలో తెరచుకున్న బ్యాంకులు... తెలంగాణలో మాత్రం మూత
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. గురునానక్ జయంతి సందర్భంగా నేడు బ్యాంకులకు సెలవు కాగా, చంద్రబాబు సర్కారు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తెరచుకున్నాయి. నేటి నుంచి రోజుకు రూ. 4,500 వరకూ పాత కరెన్సీని బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటును కల్పించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రోజుకు రూ. 10 వేల పరిమితిని సైతం ఆర్బీఐ ఎత్తి వేసింది. దీంతో ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. మరోవైపు తెలంగాణలో నేడు అన్ని బ్యాంకులకూ సెలవు. ఏటీఎం కేంద్రాల్లో సైతం కరెన్సీ నిన్ననే అయిపోయింది. సెలవు కాబట్టి ఏటీఎంలలో డబ్బు నింపే అవకాశాలు నేడు లేవు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పదు.