: గుంటూరు జిల్లాలో తెలంగాణ హోం మంత్రి నాయిని... కొండవీడులో సందడి
గుంటూరు జిల్లాలోని చారిత్రక ప్రదేశాల్లో ఒకటైన కొండవీడును పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున తమవంతు సహకారాన్ని అందిస్తామని ఆ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగులతో కలసి కొండవీడును సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోక పూర్వమే కొండవీడు అభివృద్ధికి నిధుల కేటాయింపు జరిగిందని గుర్తుచేసిన నాయిని, కొండవీడును సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా కొండవీడును మరింత అభివృద్ధి చేయాల్సి వుందని, ఇక్కడి చారిత్రక కట్టడాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు కాపాడాల్సి వుందని మోదుగుల వ్యాఖ్యానించారు.