: జగన్ కేసులపై పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
హైకోర్టు పర్యవేక్షణలోనే జగన్ కేసుల విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, జగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావును మంత్రి వర్గం నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. విచారణ జూన్ 5 కి వాయిదా పడింది.