: మోదీ మరో లీక్వాన్.. ప్రధానిని ఆకాశానికెత్తేసిన సింగపూర్ మీడియా
భారత ప్రధాని నరేంద్రమోదీని సింగపూర్ మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఆయన మరో లీక్వాన్ అంటూ కొనియాడింది. భారతదేశం అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచేందుకు ఆయన దార్శనికత, నిర్ణయాలే కారణమని పేర్కొంది. అవినీతి, నల్లధనాన్ని ఏరి పారేసేందుకు రూ. వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేశారని ప్రశంసించింది. లీక్వాన్ సింగపూర్ తొలి ప్రధాని. సింగపూర్ నేడు ప్రపంచ దేశాల సరసన నిలవడానికి ఆయన తీసుకున్న చర్యలే కారణం. ఈ కారణంగానే మోదీని, లీక్వాన్‌తో పోలుస్తూ సింగపూర్ మీడియా కథనాలు ప్రచురించింది. లీక్వాన్, మోదీ ముఖాలు కలిసి ఉన్న ఫొటోలతో ప్రత్యేకంగా వార్తలు రాశాయి.