: నోట్ల మార్పిడి అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ సమీక్ష... బ్యాంకులు, ఏటీఎంలలో విత్ డ్రా పరిమితి పెంపు
పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఈ రోజు సాయంత్రం భేటీ అయిన కేంద్ర ఆర్థిక శాఖ.. బ్యాంకులు, ఏటీఎంలలో విత్ డ్రా పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో వారానికి రూ.20 వేల విత్ డ్రా పరిమితిని 24 వేలకు పెంచింది. రోజుకు పదివేలే తీసుకోవాలన్న నిబంధనను తొలగించింది. ఏటీఎంలలోనూ విత్ డ్రా పరిమితిని రూ2 వేల నుంచి రూ.2500 వరకు పెంచింది.