: రేపు బ్యాంకులకు సెలవు.. ఆందోళనలో ప్రజలు
పెద్దనోట్ల రద్దుతో కొత్త నోట్లను తీసుకోవడానికి దేశ వ్యాప్తంగా బ్యాంకుల ముందు గంటల తరబడి ఎదురుచూస్తున్నప్పటికీ కొందరు ఖాతాదారులకి నగదు అందని పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రేపు గురునానక్ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల సిబ్బంది ఓవర్ టైమ్ చేస్తూ ఖాతాదారులకు సేవలు అందించారు. రెండో శనివారంతో పాటు ఈ రోజు కూడా బ్యాంకులు పనిచేశాయి. అయినప్పటికీ ఎంతో మంది ప్రజలకు కొత్త నోట్లు అందలేదు. మరోవైపు కొన్ని చోట్ల ఏటీఎంలు మొరాయించడం, కొన్ని ప్రాంతాల్లో అసలు తెరచుకోకపోవడంతో నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి డబ్బుల్లేక ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.