: భారీ భూకంపంతో న్యూజిలాండ్‌కు సునామీ హెచ్చరికలు జారీ.. సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న ప్రజలు
న్యూజిలాండ్‌లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో ఈరోజు భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. సంబంధిత అధికారులు కొద్ది సేపటి క్రితం దక్షిణ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని గంటల్లోనే తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, తీరప్రాంతాల ప్రజలు వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. అధికారులు చేసిన హెచ్చరికలతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు.