: పెట్రోల్ పోయించుకొని నకిలీ రెండు వేల రూపాయల నోటు ఇచ్చి పరార్!
కొత్త రెండు వేల రూపాయల నోటంటూ పెట్రోల్ బంక్ సిబ్బందికి రూ.2000 నకిలీ నోటు ఇచ్చి ఓ వ్యక్తి పెట్రోల్ పోయించుకొని పారిపోయిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కురవిలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో తన బైక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి ఓ వ్యక్తి నకిలీ రెండు వేల రూపాయల నోటుతో వచ్చాడు. పెట్రోల్ పోయించుకున్న తరువాత ఆ నోటును పెట్రోల్ బంక్ సిబ్బందికి ఇచ్చాడు. సిబ్బంది ఆ నోటును పరిశీలించి, నకిలీ నోటని గమనించేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. కొత్త నోట్లు దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్న తమకు నకిలీ నోట్లు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని వ్యాపారులు, ప్రజలు వాపోతున్నారు.