: బ్యాంకు సిబ్బందిపై రాళ్లతో దాడి చేసిన ప్రజలు... వందమందిపై కేసు నమోదు
పెద్ద నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు వస్తోన్న ప్రజలు సహనం కోల్పోతున్నారు. దేశంలోని పలు చోట్ల ఈ రోజు ఉదయం బ్యాంకులపై ప్రజలు దాడులకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఓ బ్యాంక్ ఎదుట నిలబడిన ఖాతాదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ పని ఆలస్యమవుతోందంటూ బ్యాంకు సిబ్బందిపై రాళ్లు విసిరారు. దీంతో ముగ్గురు బ్యాంకు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. దాడి చేసిన వందమందిపై కేసు నమోదు చేశారు.