: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు పెరిగిన మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం పలు దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల జరిగిన యూఎన్ సదస్సు వివరాలను తాజాగా వెబ్‌సైట్‌లో ఉంచారు. ఓ వైపు చైనా నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ యూఎన్‌లో సభ్యత్వ దేశాలైన యూకే, ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాలు భారత్‌కు మద్దతు తెలుపుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తో పాటు బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లు ప్రయత్నిస్తున్నాయి. యూకే అంబాసిడర్ మథ్యూ రైక్రోఫ్ట్ ఈ అంశంపై స్పందిస్తూ... ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. అంతేగాక, యూఎన్‌లో సభ్యత్వ దేశాల సంఖ్య మరింత పెరగాల్సి ఉందని, ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా భద్రతామండలిలో సభ్యత్వాలు పెరగాలని పేర్కొన్నారు. భద్రతామండలిలో జీ4 దేశాల సభ్యత్వాలకు మద్దతు ప్రకటిస్తున్నట్లు లామెక్ పేర్కొన్నారు. ఇటీవలే బ్రిటన్ ప్రధాని థెరిసా మే భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆమెతో ఇదే అంశంపై చర్చించిన విషయం తెలిసిందే.