: అవ‌స‌రానికి త‌గినంత మాత్ర‌మే బ్యాంకుల నుంచి డ‌బ్బు తీసుకోవాలి: ఆర్‌బీఐ


ఆదివారం త‌మ‌కు సెల‌వు దినం కావ‌డంతో ప్ర‌జ‌లంతా కొత్త నోట్ల కోసం దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకుల ముందు బారులు తీరారు. ఈ నేప‌థ్యంలో కొన్ని చోట్ల బ్యాంకు సిబ్బందితో గొడ‌వ‌ల‌కు దిగుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ మేరకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన వెలువరించింది. అవ‌స‌రానికి త‌గినంత మాత్ర‌మే బ్యాంకుల నుంచి డ‌బ్బు తీసుకోవాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన క్రమంలో ప్రజలు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, పాత నోట్ల‌ మార్పిడి చేసుకోవ‌డానికి కావాల్సినంత డ‌బ్బు ఉంద‌ని ఆర్బీఐ పేర్కొంది. ప్ర‌జ‌లు త‌రచూ బ్యాంకులకు వచ్చి ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు డ్రా చేసుకుని వాటిని దాచి పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News