: పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ‘మాస్తిగుడి’ సినిమా దర్శకుడు
కన్నడ సినిమా ‘మాస్తిగుడి’ క్లైమాక్స్ షూటింగ్ లో భాగంగా కర్ణాటకలోని తిప్పగుండనహళ్లిలో ఇటీవల అనిల్, ఉదయ్ అనే ఇద్దరు నటులు షూటింగులో భాగంగా హెలికాఫ్టర్ నుంచి దూకి మృతి చెందిన సంగతి తెలిసిందే. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ ఘటనకు కారణం. ఈ కేసులో సదరు సినిమా దర్శకుడు నాగశేఖర ఈ రోజు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఆయనతో పాటు స్టంట్‌మాస్టర్ రవివర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధూ కూడా లొంగిపోయారు. అనంతరం పోలీసులు వారిని కోర్టులో హాజరపరచగా, కోర్టు వారికి రెండు వారాల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బెంగళూరు జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్ అనసూయ ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.