: వరంగల్ జైలు నుంచి పరారైన ఇద్దరు ఖైదీల్లో ఒక ఖైదీ విశాఖలో అరెస్ట్
వరంగల్ సెంట్రల్ జైలు నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న ఇద్దరు ఖైదీల్లో ఒక వ్యక్తి సైనిక్‌సింగ్ నిన్న రాత్రి విశాఖపట్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. సైనిక్‌సింగ్ విశాఖపట్నంలోని గాజువాకలోని పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ అక్కడి పోలీసుల కంటపడ్డాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి గురించి ఆరా తీశారు. దీంతో తాను వరంగల్ సెంట్రల్ జైలు నుంచి పరారయి గాజువాకకు వచ్చినట్లు చెప్పాడు. అనంతరం ఈ రోజు వరంగల్ జైలు అధికారులకు వారు ఈ సమాచారాన్ని అందించారు. వైజాగ్ చేరుకున్న వరంగల్ పోలీసులు ఖైదీని ప్రస్తుతం వరంగల్ తీసుకొస్తున్నారు. సైనిక్ సింగ్‌తో పాటు జైలు నుంచి పారిపోయిన మరో ఖైదీ గురించి గాలింపు కొనసాగుతోందని చెప్పారు.