: పాత నోట్లు తీసుకుంటాం: ట్రాఫిక్ పోలీసులు


పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించాలని భావించేవారు తమ వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లతో చెల్లించవచ్చని పోలీసు విభాగం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను తదితర బకాయిలను వసూలు చేసేందుకు పాత నోట్ల ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ విజయవంతమైన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు విభాగం ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. రద్దయిన నోట్లతో ఈ సేవ, మీ సేవ, ఆంధ్రా బ్యాంక్, ఐసీఐసీఐ, ఎస్బీఐ తదితర బ్యాంకుల నుంచి సోమవారం సాయంత్రం వరకూ జరిమానాలు చెల్లించవచ్చని ట్రాఫిక్ పోలీస్ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News