: యూపీలో బ్యాంకులపై మొదలైన దాడులు... పోలీసుల లాఠీచార్జ్


మూడు రోజుల పాటు ఓపికగా, బ్యాంకుల ముందు ఎదురుచూసిన ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఉదయం నుంచి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న ప్రజలకు, ఉదయం 10 గంటల తరువాత బ్యాంకుల వద్దకు వచ్చిన అధికారులు, తమ వద్ద కొత్త కరెన్సీ లేదని, ఏమీ చేయలేమని చెబుతుండగా, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో తిరగబడుతున్నారు. యూపీలోని మురాదాబాద్, లక్నో, బులంద్ షహర్ తదితర ప్రాంతాల్లో నగదు నిండుకుందని చెప్పి, తిరిగి బ్యాంకులకు తాళాలు వేసి అధికారులు వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని ప్రజలు ఆయా బ్యాంకులపై దాడులకు దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. మురాదాబాద్ లోని ఎస్బీఐ బ్యాంకు లోపలికి వెళ్లి ధ్వంసం చేశారు. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో వందల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి చేరి నిరసన తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు హర్యానా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News