: పొద్దున 'గడప గడపకూ' రెక్కీ... రాత్రి దొంగతనాలు: కేశినేని నాని
వైకాపా నేతలు ఉదయం పూట 'గడప గడపకూ' అంటూ వచ్చి సమస్యలు తెలుసుకుంటామని చెబుతూ రెక్కీలు నిర్వహిస్తున్నారని, ఆపై రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేస్తున్నారని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెంలో ఈ ఉదయం జనచైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని ప్రసంగిస్తూ, వైకాపా నేతలు అభివృద్ధిపై పూర్తి అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతుంటే, అది ఇష్టం లేకనే వైకాపా లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు. వైకాపా ఆగడాలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.