: ప్రధానికి మెసేజ్ పంపిన ఐశ్వర్యా రాయ్


నల్లధనాన్ని అరికట్టే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం పట్ల మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్, ప్రధాని మోదీకి ఓ సందేశం పంపారు. "ఓ ఇండియన్ గా, ప్రధానిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దేశాన్ని అవినీతి, లంచగొండితనం నుంచి బయటపడేసేందుకు మీరు చాలా బలమైన నిర్ణయం తీసుకున్నారు. మార్పు ఎన్నడూ సులభంగా జరగదు. ప్రతి ఒక్కరూ భవిష్యత్ పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని 43 ఏళ్ల ఈ హీరోయిన్ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో అంతగా యాక్టివ్ గా ఉండని ఐశ్వర్య, మోదీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ, ప్రజలకు ఓ చిన్న సందేశాన్ని ఇవ్వడం గమనార్హం .

  • Loading...

More Telugu News