: రెండు రోజుల్లోనే రూ. 2 వేల దొంగనోటు... కర్ణాటకలో రైతును మోసం చేసిన దుండగులు!


రెండు వేల రూపాయల కొత్త నోట్లు వచ్చి రెండు రోజులు గడిచాయో లేదో, దుండగులు దొంగ నోట్లు తయారు చేసి ఓ రైతును మోసం చేశారు. ఎంతో సెక్యూరిటీ ఉందని చెప్పుకున్న నోట్లను ఫోటోకాపీ తీసిన దుండగులు, కర్ణాటకలోని ఓ రైతును మోసం చేశారు. ఈ ఘటన చిక్ మగ్ ళూరు మార్కెట్లో జరిగింది. తాను తెచ్చిన ఉల్లిపాయల లోడ్ ను విక్రయించేందుకు అశోక్ అనే రైతు ఏపీఎంసీ మార్కెట్ కు రాగా, గుర్తు తెలియని వ్యక్తి ఒకరు దాన్ని కొన్నాడు. ఆపై కొత్త 2 వేల రూపాయల నోటంటూ దాన్ని అశోక్ కు ఇచ్చాడు. దీన్ని బ్యాంకులు జారీ చేశాయని చెప్పాడు. అతను చెప్పిన విషయాన్ని నమ్మిన అశోక్ నోటు తీసుకుని ఆపై దాన్ని తన స్నేహితులకు చూపాడు. ఇది ఒరిజినల్ కాదని, జిరాక్స్ తీసి ఇస్తే నమ్మేశావని చెబితే అవాక్కయ్యాడు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొంచెం జాగ్రత్తగా చూస్తే, దీన్ని ఫోటోకాపీ అని సులువుగా గుర్తించవచ్చని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News