: నటి సబర్న గదిలో సిగరెట్ ముక్కలు... హత్యేనన్న కోణంలో విచారణ!


అనుమానాస్పదంగా తన ఇంట్లో నగ్న స్థితిలో మృతదేహంగా కనిపించిన తమిళ నటి సబర్న ఆనంద్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆమె మృతదేహం నగ్నంగా కనిపించడం, ఆపై గదిలో సిగరెట్ ముక్కలు పడి ఉండటాన్ని చూసిన పోలీసులు ఎవరైనా హత్య చేశారా? అన్న కోణాన్ని కూడా విచారిస్తున్నారు. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భావించినప్పటికీ, ఆమె డైరీ దొరకడం, అందులో ప్రేమ వ్యవహారం గురించిన సమాచారం ఉండటంతో ఆ దిశగా కూడా విచారణ జరుపుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కేసులో మిస్టరీని ఛేదించేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని, ఆమె ఒంటిపై పంటి గాట్లు, మృతదేహం పడివున్న పరిస్థితిని చూసి, కేసు దర్యాఫ్తును సవాల్ గా తీసుకున్నామని, హత్యకేసు మిస్టరీ చిక్కుముడులు విప్పుతామని అన్నారు.

  • Loading...

More Telugu News