: నన్ను ఓడించింది ఎఫ్బీఐ డైరెక్టరే!: హిల్లరీ క్లింటన్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోవడం వెనుక ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ ఉన్నారని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. తనకు విరాళాలిచ్చిన వ్యక్తులతో సమావేశమైన ఆమె, ఈ-మెయిల్ కేసును తిరిగి తెరవడం తన విజయావకాశాలను దెబ్బతీసిందని, ఆపై క్లీన్ చిట్ ఇస్తే, అది కావాలనే ఇచ్చినట్టు ప్రజలు భావించారని అన్నారు. ఈ వ్యవహారంలో కామీ రాసిన రెండు లేఖల వల్ల రిపబ్లికన్లు రెండు కీలక రాష్ట్రాల్లో విజయం సాధించారని తెలిపారు. తన ఓటమికి ఇంకా కారణాలు ఉన్నప్పటికీ, కామీ లేఖలు, ఆయన మీడియా సమావేశాలే అధిక ప్రభావం చూపాయని హిల్లరీ అభిప్రాయపడ్డారు. కామీ ప్రకటనల తరువాత, తన విజయం ఖాయమని చెప్పిన పోల్స్ తారుమారు కావడం ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News