: యుద్ధభూమి నుంచి ప్రతిష్ఠాత్మక ఐఐటీకి.. కశ్మీర్ నుంచి నలుగురు ఆణిముత్యాలు!


పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కారణంగా నిత్యం యుద్ధ భూమిలా మారిన పూంఛ్ జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ప్రతిష్ఠాత్మక ఐఐటీలో చేరి రికార్డు సృష్టించారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూంచ్ జిల్లాలోని రెండు గ్రామాలకు చెందిన 17-19 ఏళ్ల మధ్య ఉన్న నలుగురు విద్యార్థులు దేశంలోని వివిధ ఐఐటీల్లో సీట్లు సంపాదించారు. షిండ్రా గ్రామానికి చెందిన షాహిద్ ఆఫ్రిది(19), కలాయి గ్రామం నుంచి అకీబ్ ముజ్తాబా(18), ఉస్మాన్ హఫీజ్(17), హిలాల్ అహ్మద్(19) వివిధ ఐఐటీల్లో సీట్లు సాధించి సత్తా చాటారు. షాహిద్ ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్ అభ్యసిస్తుండగా, అకీబ్ ఐఐటీ భువనేశ్వర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఐఐటీ ఢిల్లీలో ఉస్మాన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఐఐటీ పట్నాలో హిలాల్ కంప్యూటర్ సైన్స్ అభ్యసిస్తున్నారు. ‘‘తాము ఇండియాలో ఉన్నందువల్లే ఐఐటియన్లమయ్యామని షాహిద్ గర్వంగా చెప్పాడు. ‘‘షాహిద్ ఆఫ్రిదిలా నేనేమీ గొప్ప బ్యాట్స్‌మన్‌ను కాను. అయితే, ముస్లింలు అందరూ మిలిటెంట్లే అంటూ ఐఐటీ ఫ్రెండ్స్ నుంచి వచ్చే బౌన్సర్లను మాత్రం సమర్థంగా ఎదుర్కొన్నా’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. సరిహద్దు ప్రాంతాలలో నివసించడం గురించి వారికి వివరించడాన్ని కూడా తాను గర్వంగా భావించానని తెలిపాడు. జూలైలో హిజ్బుల్ కమాండ్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌కు ఒక్కనెల ముందు అంటే మేలో పూంచ్ జిల్లా విద్యార్థుల ప్రతిభ గురించి ప్రపంచానికి తెలిసింది.

  • Loading...

More Telugu News