: పెద్ద నోట్ల రద్దుతో అవస్థలు పడుతున్న ప్రజలకు శుభవార్త.. రిజర్వ్ బ్యాంకుకు చేరుకున్న 5 మిలియన్ల రూ.500 నోట్లు
నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుభవార్త. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేలు, రూ. 500 నోట్లను ప్రవేశపెట్టినట్టు చెప్పింది. అయితే ఇప్పటి వరకు రూ.2 వేల నోటు తప్ప రూ.500 నోటు చలామణిలోకి రాలేదు. అయితే ఈరోజు, లేదంటే రేపటి నుంచి కొత్త రూ.500 నోటును ప్రజలు అందుకునే అవకాశం కనిపిస్తోంది. నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్(సీఎన్‌పీ) నుంచి కొత్త రూ.500 నోట్లతో కూడిన 5 మిలియన్ లాట్ రిజర్వు బ్యాంకుకు చేరుకుంది. రూ.500 నోట్ల మొదటి కన్‌సైన్‌మెంట్‌ను రిజర్వు బ్యాంకుకు పంపించామని, బుధవారం మరో లాట్ పంపించనున్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో ఉన్న 9 నోట్ల ప్రింటింగ్ ప్రెస్‌లలో సీఎన్‌పీ ఒకటి. ఇక్కడ రూ.20, రూ.50, రూ.100 నోట్లను పెద్ద సంఖ్యలో ప్రింట్ చేస్తుంటారు. తాజాగా కొత్త రూ.500 నోట్లను అచ్చు వేస్తున్నారు.