: మోదీ దెబ్బకు విలవిల్లాడుతున్న జనాలు: కేటీఆర్ ఆందోళన
పెద్ద నోట్లను రద్దు చేయాలని మోదీ సార్ తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారని, కనీసం కూరగాయలు కూడా కొనుక్కునే స్థితిలో ప్రజలు లేరని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పీఆర్టీయూ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ రాబడి సైతం తగ్గిపోయిందని, ఏ బ్యాంకు ముందు చూసినా కనీసం 500 మంది వరకూ కనిపిస్తూ ఉన్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోయిందని, ఈ పరిస్థితి తాత్కాలికమా? లేక మరింత కాలం సాగుతుందా? అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేమని అభిప్రాయపడ్డారు. రుణమాఫీకి సంబంధించి ఓ విడత సొమ్మును బ్యాంకులకు చెల్లించాల్సి వుందని తెలిపారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని సంప్రదించామని వెల్లడించారు.