: మోదీ దెబ్బతో చీకట్లోనే సమాధి కానున్న రూ. లక్షల కోట్లు.. నోట్ల రద్దు లాభంలో రాష్టాలకూ వాటా


ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తక్కువలో తక్కువగా రూ.3.5 నుంచి రూ.4 లక్షల కోట్ల వరకు కేంద్రానికి కలిసి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సొమ్ములో కొంత రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటాగా అందే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దుతో చలామణిలో ఉన్న నగదు రూ.17 లక్షల కోట్ల రూపాయల నుంచి రూ.13 నుంచి రూ.13.5 లక్షల కోట్లకు తగ్గుతుందని అంచనా. భారీగా నల్లధనాన్ని పోగేసుకున్న నల్లకుబేరులు వాటిని చట్టబద్ధంగా మార్చుకునే వెసులుబాటు లేకపోవడంతో దానిని చీకట్లోనే సమాధి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కలకు చిక్కకుండా గల్లంతైన ఈ సొమ్ము ప్రభుత్వ పద్దుల్లోనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సొమ్ము స్థానంలో వచ్చే కొత్త కరెన్సీ నోట్లు సర్కారు ఖాతాలోకే చేరుతాయి. లెక్కల ప్రకారం ఇందులో కొంత రాష్ట్ర ప్రభుత్వాలకు చేరుతుంది. ఇంత పెద్దమొత్తంలో కేంద్ర ఖజానాకు చేరితే ఆర్థిక రంగంలో మోదీ సర్కారు అద్భుతాలు సృష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే డిసెంబరు 30 గడువు ముగిస్తే కానీ గల్లంతైన సొమ్ము ఎంతనే వాస్తవాల లెక్కలు తేలవని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News