: ధోనీని బయటకు నెట్టేసేంత తొందర ఎందుకు?
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ ఘాటుగా స్పందించాడు. కెప్టెన్సీ చేపట్టి ఇంతకాలమైనా ధోనీ చక్కగా బాధ్యత నిర్వర్తిస్తూ, ఆటగాడిగా ఆకట్టుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. అతని రిటైర్మెంట్ గురించి ఇండియాలో తరచు జరుగుతున్న చర్చ వల్ల ఆటపట్ల అతనిలో ఆసక్తి సన్నగిల్లే అవకాశముందని గిల్లీ పేర్కొన్నాడు. బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తిస్తున్న ధోనీని బయటకు తోసేసేంత తొందర ఎందుకని ప్రశ్నించాడు. టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని గిల్ క్రిస్ట్ కితాబునిచ్చాడు.