: 79 ఏళ్ల తరువాత ఇంగ్లండ్ జట్టు నుంచి ఇతనిదే రికార్డు!


రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు ఈ రోజు 114 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అర్ధ సెంచరీ సాధించిన హసీబ్ హమీద్ (62) రికార్డు నెలకొల్పాడు. 20 ఏళ్లలోపు వయసులో అర్ధసెంచరీ సాధించిన మూడో ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు 20 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించడం విశేషం. 1906లో జాక్ క్రాఫోర్డ్, 1937లో డెన్నిస్ క్రాంప్టన్ ఈ ఘనతను సాధించగా, సుమారు 79 ఏళ్ల తరువాత నేటి మ్యాచ్ హసీబ్ హమీద్ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. హమీద్ వయసు కేవలం 19 ఏళ్లు కావడం విశేషం.

  • Loading...

More Telugu News