: 'వెయ్యి రూపాయలైనా పర్లేదు ఉప్పు ఇవ్వు' అంటున్న ప్రజలు!


ఉప్పు కష్టాలు తెలుగు రాష్ట్రాలను తాకాయి. ఉప్పు కొరత ఏర్పడనుందన్న పుకార్లతో, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేజీ ఉప్పును 400 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని మీడియాలో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడికక్కడ ప్రజానీకం ఉప్పు షాపులపై దండయాత్రకు దిగారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఏకంగా ఓ మహిళ ఉప్పు దొంగతనం చేసింది. అదే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 500, 1000 రూపాయల నోట్లు పట్టుకుని ఉప్పుకావాలని దుకాణదారుల వెంటబడ్డారు. అలాంటిదేమీ లేదని ఓ వ్యాపారి మొత్తుకున్నా వినని వినియోగదారులు, 'ఇంద.. వెయ్యి రూపాయలనోటు.. ఉప్పు ఇవ్వు' అంటూ డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆశ్చర్యపోయారు. ఈ లోటు తమ దగ్గరున్న 1000 రూపాయల నోట్లు వదిలించుకునేందుకో, లేక అమాయకత్వమో అర్ధం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News