: తన ఫోటోలు వద్దన్న పవన్ కల్యాణ్ భార్య.. డిలీట్ చేసేసిన ఫోటోగ్రాఫర్లు!
ప్రముఖ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవా ఎలా ఉంటుందో మీడియాకు, మెగా వీరాభిమానులకు తప్ప ఇతరులకు పెద్దగా తెలియదు. ఆమె కూడా మీడియాలో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. ఇదిలా ఉంచితే, మంచు ఫ్యామిలీకి సంబంధించిన విద్యాసంస్థలో ఇటీవల హాలోవీన్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ఆమె హాజరయ్యారు. దీంతో మీడియా కెమెరాలన్నీ పవన్ కల్యాణ్ భార్యవైపు తిరిగిపోయి క్లిక్ మనిపించాయి. దీంతో ఆమె నేరుగా మీడియా ప్రతినిధుల వద్దకు వెళ్లి...తనకు మీడియాలో కనిపించడం పెద్దగా ఇష్టం ఉండదని, తన ఫోటోలను డిలీట్ చేయాలని సౌమ్యంగా అడిగారు. దాంతో వెంటనే తాము తీసిన ఫోటోలను మీడియా ప్రతినిధులు డిలీట్ చేసేశారట. కొందరు స్టూడెంట్స్ మాత్రం ఆమె ఫోటోలను తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.