: ఒకేసారి చైతన్య, శింబుతో నటించడం బాగుంది: మంజిమ మోహన్


ఒకేసారి నాగచైతన్య, శింబులతో కలిసి నటించడం చాలా బాగుందని 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన మంజిమ మోహన్ తెలిపింది. తెలుగులో నాగచైతన్య హీరోగా, తమిళంలో శింబు హీరోగా.. రెండు వెర్షన్లలోనూ మంజిమ కథానాయికగా రూపొందిన సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో'. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ, మంచి సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పింది. గౌతమ్ మీనన్ ఈ సినిమాను అద్భుతంగా రూపొందించాడని చెప్పింది. ఒకే సన్నివేశాన్ని నాగచైతన్య, శింబులతో కలసి వేర్వేరు వెర్షన్లకు చేయడం కొత్తగా అనిపించిందని చెప్పింది. తాను బైక్ పై స్థిరంగా కూర్చుంటే... ఒకసారి నాగచైతన్య, మరోసారి శింబు తనను తిప్పేవారని చెప్పింది. ఈ సినిమా షూటింగ్ కోసం కన్యాకుమారి నుంచి గోవా వరకు వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడం చాలా నచ్చిందని తెలిపింది. సినిమా విజయవంతం కావడంతో సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది.

  • Loading...

More Telugu News