: పుజారాను ఆ స్థానంలోనే ఆడించాలి: గంగూలీ
ఛటేశ్వర్ పుజారా వరుసగా రెండు సెంచరీలు సాధించడం పట్ల టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. కోల్ కతాలో గంగూలీ మాట్లాడుతూ, కివీస్ తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ, నిన్న సెంచరీ చేయడంతో పుజారా మూడో స్థానానికి తానే సరైన వ్యక్తినని నిరూపించుకున్నాడని అన్నాడు. అదే స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి సచిన్, ద్రవిడ్, లారా, స్టీవ్ వాలు నిరూపించుకున్నారని, వారిలాగే పుజారా కూడా మూడో స్థానమే తన ఖిల్లా అని నిరూపించుకున్నాడని చెప్పాడు. స్వదేశంలో పుజారాను అదే స్థానంలో ఆడించాలని, విదేశాల్లో పుజారా ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు.