: వృద్ధాశ్రమాల్లోని తల్లులు నన్ను ఆశీర్వదిస్తున్నారు: ప్రధాని మోదీ
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో వృద్ధాశ్రమాల్లోని తల్లులంతా తనను ఆశీర్వదిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ, కోబెలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లులను వృద్ధాశ్రమాల్లో చేర్పించిన కుమారులు, పెద్దనోట్ల రద్దు తర్వాత వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో రెండున్నర లక్షల రూపాయల కనీస మొత్తం వేశారని చెప్పారు. ఈ తల్లులందరూ తనను ఆశీర్వదిస్తున్నారని చెప్పిన మోదీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తల్లుల్లో ఆనందాన్ని.. కొడుకుల్లో మార్పును తీసుకువచ్చిందన్నారు. ఇక, సామాన్య ప్రజల విషయానికొస్తే, ఈ నిర్ణయం వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతున్నా సహకరిస్తున్నారని ప్రశంసించారు.