: నల్లధనం సద్వినియోగానికి.. మోదీకి హీరోయిన్ పూజా హెగ్డే సూచన
పెద్ద నోట్లను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయంతో ఎక్కడెక్కడో ఉన్న బ్లాక్ మనీ బయటకు వస్తోంది. కానీ, ఆ డబ్బును వైట్ చేసుకునే అవకాశం లేని వారు వాటిని పడేయడం, తగలబెట్టడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి హీరోయిన్ పూజా హెగ్డే ఓ సూచన చేసింది. వచ్చే ఏడాది మార్చి వరకు రూ. 500, రూ. 1000 నోట్లను ప్రభుత్వ ఆసుపత్రులకు డొనేషన్ గా ఇచ్చే అవకాశం కల్పించాలని సూచించింది. దీని వల్ల ఓ మంచి కార్యక్రమానికి బ్లాక్ మనీ ఉపయోగపడినట్టు అవుతుందని చెప్పింది. అనవసరంగా డబ్బును నాశనం చేయడం కంటే... నల్లధనం కలిగినవారు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆ డబ్బును డొనేట్ చేస్తే బాగుంటుందని సూచించింది.