: రూ.2 వేల నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ వదంతులు!
కొత్తగా ముద్రించిన రూ.2 వేల నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు వ్యాపించాయి. దీంతో, ప్రజలు కంగారుపడిపోతున్నారు. ఈ నోటు వెనుక భాగంలో రెండు వేల రూపాయలు అనే అర్థం వచ్చేలా మొత్తం 15 భారతీయ భాషల్లో ముద్రించారు. అయితే, ‘దోన్ హజార్ రూపయా’, ‘దోన్ హజార్ రుపయే’ అని రెండు రకాలుగా వుంది. అలా, అక్షర దోషాలతో ఈ నోట్లను ముద్రించారని, ఈ నోట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించాయి. కాగా, ‘దోన్ హజార్ రూపయా’, ‘దోన్ హజార్ రుపయే’ అనే వాటిలో ఒకటి మరాఠి భాష కాగా, మరోటి కొంకణి భాష అయి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తప్పుడు తడకలగా నోట్లను ప్రభుత్వం ముద్రించదని, ఈ వదంతుల్లో వాస్తవం లేదని కొట్టిపారేస్తున్న వారూ లేకపోలేదు.