: ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. స్కోరు 435 పరుగులు
ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. సాహా 35 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో జడేజా (3) క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్ లో అశ్విన్ 43 పరుగులతో ఆడుతున్నాడు. భారత్ ప్రస్తుత స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 435 పరుగులు. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 102 పరుగులు వెనుకబడి ఉంది. నాలుగో రోజు ఆటలో మరో 51 ఓవర్లు మిగిలి ఉన్నాయి.