: జగన్ ఆదేశిస్తే రాజీనామాలకు సిద్ధం: మేకపాటి


ఏపీకి ప్రత్యేక హోదాను సాధించడమే వైకాపా లక్ష్యమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన రెడ్డి తెలిపారు. హోదా కోసం తమ అధ్యక్షుడు నిరాహార దీక్షలు, ధర్నాలు చేశారని... ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళతామని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పలు పరిశ్రమలు వస్తాయని... ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడకో వెళ్లాల్సిన అగత్యం ఉండదని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించడానికి తమ అధినేత ఆదేశిస్తే వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జగన్ అధ్యక్షతన ఈ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానంతరం తన సహచర ఎంపీలతో కలిసి మేకపాటి మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News